నిహారిక మాకు అమ్మతో సమానం: సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej About Niharika. ఈనెల 9వ తేదీన నిహారిక పెళ్లి జొన్నలగడ్డ వెంకట చైతన్యతో
By Medi Samrat Published on 16 Dec 2020 1:44 PM IST
ఈనెల 9వ తేదీన నిహారిక పెళ్లి జొన్నలగడ్డ వెంకట చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే నిహారిక పెళ్లిలో కేవలం మెగా కుటుంబ సభ్యులు ముఖ్యమైన సన్నిహితులు మాత్రమే పాల్గొని ఎంతో వేడుకగా జరుపుకున్నారు.ఈ పెళ్లి కార్యక్రమం ముగియగానే మెగా హీరోలు అందరూ ఎవరూ సినిమా షూటింగ్ లలో వారు బిజీగా ఉండి పోయారు. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న "సోలో బ్రతుకే సో బెటర్" సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసినదే.
ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిహారిక పెళ్లిలో ఎంతో సరదాగా ఎంజాయ్ చేసామని తెలిపాడు. చిన్నప్పటి నుంచి అందరూ కలిసే పెరగడంతో మా అందరి మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం ఏర్పడి ఉండేదని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.నిహారిక అచ్చం మా అమ్మ లాగా పోలి ఉండడంతో అందరూ తనని మేనత్త పోలిక అంటారు. అందుకే నిహారికను ఎప్పుడు మా అమ్మతో సమానంగా చూస్తామని ఈ మెగా హీరో ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.
అయితే మరి కొద్ది రోజుల్లోనే మెగా ఇంట్లో మరో పెళ్లి బాజలుల మోగనున్నాయని సాయి ధరమ్ తేజ్ ను అడగగా పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని సోలో లైఫ్ ఎంతో హ్యాపీగా ఉందని చెప్పారు. అయితే అల్లు శిరీష్ నాకన్నా వయసులో పెద్ద వాడు కావడంతో మొదట అల్లు శిరీష్ పెళ్లి జరగనుందని, ఇంటికి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలు, కలలు ఉన్నాయని అవన్నీ నెరవేరే దాకా పెళ్లి గురించి ఆలోచించేది లేదని ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తెలిపారు. అయితే మరి కొద్ది రోజుల్లో మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి బాజా మోగనుందని తెలియడంతో మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.