హృతిక్ రోషన్ చేతులు పట్టుకుని బయటకు వచ్చిన మిస్టరీ గర్ల్.. మరెవరో కాదు..

Saba Azad, Hrithik Roshan met through common friend. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒక యువతితో ముంబైలోని ఓ రెస్టారెంట్

By Medi Samrat  Published on  31 Jan 2022 6:48 PM IST
హృతిక్ రోషన్ చేతులు పట్టుకుని బయటకు వచ్చిన మిస్టరీ గర్ల్.. మరెవరో కాదు..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒక యువతితో ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి చేతిలో చేయి వేసుకుని బయటకు వస్తుండగా అక్కడే ఉన్న వాళ్లు కెమెరాలను క్లిక్ మనిపించారు. వైట్ అండ్ వైట్ లో ఉన్న హృతిక్ బ్లూ జాకెట్ ధరించి ఉన్నాడు. ఆ యువతి లూజ్ ప్యాంట్, బ్లాక్ టాప్ లో మాస్క్ ధరించి ఉండటంతో ముఖం కనిపించడం లేదు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కారులోకి ఎక్కేంత వరకు ఆమె చేతిని హృతిక్ వదల్లేదు. చేతిలో చేయి వేసుకునే ఇద్దరూ కారులోకి ఎక్కారు.

ఆ యువతి మ్యుజీషియన్, యాక్ట్రెస్ సబా ఆజాద్‌ అని తేలింది. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ రెండేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినా తమ పిల్లలైన హ్రేహాన్, హృదాన్‌లకు తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. నటి సబా ఆజాద్‌తో హృతిక్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. వీరిద్దరిపై ప్రజలు ఊహించుకోవడం ప్రారంభించారు. నటి సబా ఆజాద్‌తో హృతిక్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. హృతిక్ రోషన్, సబా ఒకరినొకరు ఇండీ సంగీతంలో ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. వారి మొదటి సమావేశం తర్వాత, హృతిక్ మరియు సబా టచ్‌లో ఉన్నారు. డిన్నర్ కోసం ఇటీవల కలుసుకున్నారు.


Next Story