RRR Movie : హైద‌రాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బృందం.. ఘ‌న‌స్వాగ‌తం

ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆస్కార్ అవార్డు అందుకున్న అనంత‌రం తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2023 11:01 AM IST
RRR Movie : హైద‌రాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బృందం.. ఘ‌న‌స్వాగ‌తం

సినీ ప్ర‌పంచంలో అత్యున్న‌స్థాయి అవార్డుగా బావించే ఆస్కార్ అవార్డు సాధించిన అనంత‌రం 'ఆర్ఆర్ఆర్' చిత్రం బృందం శుక్ర‌వారం హైద‌రాబాద్‌కు చేరుకుంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున రాజమౌళి, కీరవాణి దంపతులు, కార్తికేయ, సింహా, కాలభైరవలు త‌దిత‌రులు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ నినాదాలు చేస్తూ ఆస్కార్‌ గెలిచినందుకు అభినందనలు తెలిపారు.

రాజ‌మౌళి, కీర‌వాణితో ఫోటోలు దిగేందుకు య‌త్నించారు. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంగ‌ణం అంతా ర‌ద్దీగా మారింది. వారితో మాట్లాడేందుకు య‌త్నించినా జై హింద్‌ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్వదేశానికి వ‌చ్చారు. అయితే.. నేరుగా హైద‌రాబాద్ రాకుండా ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. అక్క‌డ చ‌ర‌ణ్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ ల‌భించింది. ఈ రోజు సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని రామ్‌చ‌ర‌ణ్ క‌ల‌వ‌నున్నారు. వీరు ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ముఖ్య అతిథులుగా పాల్గొన‌నున్నారు. రాత్రికి చ‌ర‌ణ్ హైద‌రాబాద్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Next Story