ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ఆటంకం కలగకపోతే చాలు

RRR Release Date Announced. ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రిలీజ్ డేట్లు అనుకున్నారు.

By Medi Samrat
Published on : 31 Jan 2022 6:20 PM IST

ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ఆటంకం కలగకపోతే చాలు

ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రిలీజ్ డేట్లు అనుకున్నారు. ఆ రిలీజ్ డేట్లు అన్నీ వాయిదా పడుతూనే వస్తున్నాయి. తాజాగా మరో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా, పలు రాష్ట్రాలలో కర్ఫ్యూలు, ఆంక్షల కారణంగా విడుదల చేయడం కుదరలేదు. ప్రస్తుతం మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ జూనియర్, అలియా భట్ మరియు అజయ్ దేవగన్ నటించిన సినిమా విడుదలను వాయిదా వేస్తూనే వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 29 న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు మార్చి 25, 2022న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. RRR అనేది ఇద్దరు లెజెండరీ విప్లవకారుల కథ.. పూర్తిగా కల్పితమనే చెబుతున్నారు చిత్ర దర్శకనిర్మాతలు. 1920లలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పోరాడారనేది రాజమౌళి చాలా గ్రాండ్ గా చూపించబోతున్నాడు.


Next Story