ఆర్ఆర్ఆర్ నిర్మాత వ్యాఖ్యలు దేనికి సంకేతం
RRR producer DVV Danayya. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కించుకుంది.
By Medi Samrat Published on 15 March 2023 8:30 PM ISTRRR producer DVV Danayya
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కించుకుంది. అమెరికాలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఎక్కడా నిర్మాత దానయ్య ప్రస్తావన రాలేదు. అయితే దానయ్య చాలా తక్కువగా మాట్లాడుతారనే విషయం చాలా మంది మరచిపోయారు. ఆయనకు రాజమౌళికి చెడింది అంటూ కొన్ని కథనాలు కూడా వండి వారిస్తూ వస్తుండగా.. దానయ్య మీడియాతో మాట్లాడారు. రాజమౌళితో ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చారు. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గొప్ప విషయం. దీనికి కర్త కర్మ క్రియ రాజమౌళినే. ఆస్కార్ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్నారు. ఆస్కార్ గెలిచాక వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశాను. అయితే ఈవెంట్లో వాళ్ళు బిజీగా ఉండడంతో కుదర్లేదన్నారు. నాటు నాటు సాంగ్ కోసం 17 రోజులు రిహార్సల్స్ నిర్వహించామని.. ముప్పై రోజులు షూటింగ్ చేశామని తెలిపారు. ఆ పాట కోసం పడ్డ కష్టానికి ఆస్కార్ రూపంలో ప్రతిఫలం దక్కింది. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. రాజమౌళితో 2006 నుండి జర్నీ చేస్తున్నాను. నాకు ఒక మూవీ చేయాలని అడ్వాన్స్ ఇచ్చాను. మర్యాద రామన్న చేయమన్నారు. కాదు పెద్ద సినిమా చేద్దామన్నారు. అయితే బాహుబలి ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యే వరకు వేచి చూడమన్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్. వంటి బడా ప్రాజెక్ట్స్ నిర్మిస్తానని అనుకోలేదని దానయ్య తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందని చెప్పారు.