'ఆర్‌ఆర్‌ఆర్‌' హాట్‌ అప్‌డేట్‌.. ఆద్యంతం ఆకట్టుకునేలా..!

RRR glimpse out now. పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా యూనిట్‌

By అంజి  Published on  1 Nov 2021 6:08 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ హాట్‌ అప్‌డేట్‌.. ఆద్యంతం ఆకట్టుకునేలా..!

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా యూనిట్‌ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' పేరుతో 46 సెకన్లు ఉన్న ఓ వీడియోను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించారు. ఈ స్పెషల్‌ వీడియో.. ఇప్పటి వరకూ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ కంటే భిన్నంగా ఉంది. వీడియో మొత్తం కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళ్లి దర్శకుడిగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. దాదాపు రూ.450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా, కుమ్రంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ బ్యూటీ ఒలీవియా మోరీస్‌ కనిపించనున్నారు. ఇక అజయ్‌ దేవగన్‌, శ్రియ, సముద్రఖని పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Next Story