'విక్రమ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్న కమల్

Rolex trends on Twitter, after Surya’s cameo in Vikram. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ ఆనందంగా ఉన్నారు

By Medi Samrat  Published on  8 Jun 2022 9:00 PM IST
విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్న కమల్

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ ఆనందంగా ఉన్నారు. విక్రమ్ సినిమా కమల్ హాసన్‌కు లాభాల పంట పండిస్తోంది. కమల్ హాసన్ ఈ సినిమాకు పని చేసిన వారికి గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు కాస్ట్ లీ కారును గిఫ్ట్‌గా ఇవ్వగా.. ఇప్పుడు సూర్యకు విలువైన బహుమతిని ఇచ్చాడు. ఈ సినిమాలో సూర్య క్లైమాక్స్ లో కనపడతాడు. సీక్వెల్ ఉంటుందని హింట్స్ ఇచ్చే క్యారెక్టర్ అది.

తాను పోషించిన రోలెక్స్ పాత్ర కు తగ్గట్టుగా రోలెక్స్ వాచ్‌ ని కమల్ సూర్యకు గిఫ్ట్ ఇచ్చాడు. Rolex Day-Date 40 Rose Gold President మోడల్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు 62 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. సూర్య చివరి మూడు నిమిషాలు దడదడలాడించేశాడని, తన మీద ప్రేమతోనే ఈ రోల్ చేశాడంటూ సూర్య గురించి కమల్ హాసన్ ఎంతో గొప్పగా చెప్పారు. వచ్చే సినిమాలో తామిద్దరం కలిసి నటించబోతోన్నట్టు చెప్పుకొచ్చారు కమల్

విక్రమ్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా కమల్హాసన్ లోకేష్ కనకరాజు ఒక కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. 2.5 కోట్లు ఖరీదు చేసే లెక్సియన్ కారు తో పాటు ఒక ఎమోషనల్ లెటర్ ని కూడా లోకేష్ కనగరాజ్ కు అందించారు కమల్ హాసన్. సోషల్ మీడియా వేదికగా లోకేష్ కనగరాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు.













Next Story