జబర్దస్త్ లో బెస్ట్ కమెడియన్ ఎవరంటే రోజా అన్న నాగబాబు.. క్లారిటీ ఇచ్చారుగా..!

Nagababu Comments About Roja. జబర్దస్త్ షోలో ఒకప్పుడు నాగబాబు-రోజా కలిసి జడ్జిలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  22 March 2021 3:43 PM IST
Nagababu Comments About Roja

జబర్దస్త్ షోలో ఒకప్పుడు నాగబాబు-రోజా కలిసి జడ్జిలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే..! ఎందుకో కొన్ని కారణాల వలన జబర్దస్త్ ను వీడారు. ఇటీవల నాగబాబు ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో చాటింగ్ లో పాల్గొన్నారు. ఆయన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఓ ఆసక్తికర ప్రశ్న అభిమానులు నాగబాబును అడిగారు. 'జబర్దస్త్ లో బెస్ట్ కమెడియన్ ఎవరు..?' అని..! దీనికి నాగబాబు ఏ మాత్రం తడుముకోకుండా 'రోజా' అంటే ఆమె ఫోటోను పోస్టు చేశారు. ఎవరైనా కమెడియన్ పేరు చెబుతారేమోనని అనుకున్నారు.. కానీ ఇలా రోజా పేరు చెప్పడంతో వివాదం మొదలైంది. జబర్దస్త్‌లో అంతమంది కమెడియన్స్ ఉండగా నాగబాబు రోజానే కావాలని టార్గెట్ చేశారంటూ పలువురు విమర్శించడం మొదలు పెట్టారు.

ఇక ఈ వివాదంపై తాజాగా నాగబాబు స్పందించారు. కమెడియన్ అనగానే ఎవ్వరైనా గెటప్ శ్రీను లాంటి వాళ్ల పేర్లు చెబుతాను అని అనుకుంటారని.. అందుకే వెరైటీగా ఉంటుందని, మీ లాంటి వాళ్లు (మీమర్స్) షాక్ అవుతారని రోజా పేరు చెప్పానని నాగబాబు వివరణ ఇచ్చారు. ఈ మధ్య ఆమె పంచులు కూడా బాగానే వేస్తున్నారు కాబట్టి అలా చెప్పానని తెలిపారు. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్స్ వేసే పంచ్‌ల కంటే.. రోజా వేసే పంచ్ డైలాగులు అంటే తనకు ఇష్టమన్నారు. తమ మధ్య కొంతమేర రాజకీయపరమైన విబేధాలున్నా వ్యక్తిగతంగా ఎలాంటి కాంట్రవర్సీలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు.


Next Story