బాలకృష్ణ ఇంటివైపు దూసుకెళ్లిన జీపు.. త‌ప్పిన ప్ర‌మాదం

Road accident at Balakrishna House in Jubilee hills.సీనియ‌ర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ నివాసం వ‌ద్ద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 4:44 AM GMT
బాలకృష్ణ ఇంటివైపు దూసుకెళ్లిన జీపు.. త‌ప్పిన ప్ర‌మాదం

సీనియ‌ర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ నివాసం వ‌ద్ద మంగ‌ళ‌వారం సాయంత్రం రోడ్డు ప్ర‌మాదం జరిగింది. హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబ‌ర్ 45 లో బాల‌య్య నివాసం ఉంటున్నారు. కాగా.. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయన ఇంటివైపుకి వేగంగా ఓ జీపు దూసుకొచ్చింది. ఆయ‌న ఇంటి గోడ‌ని, ఫెన్సింగ్‌ని ఢీ కొట్టింది. అనంత‌రం బాల‌య్య ఇంటి గేటు వ‌ద్ద ఆగిపోయింది. ఆ సమయంలో ఆ వాహనాన్ని ఓ యువతి నడిపింది.

అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్ర‌మంలో వాహ‌నం అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొన్న‌ద‌ని.. అది తీసే క్ర‌మంలో వాహ‌నం అదుపు త‌ప్పి బాల‌య్య ఇంటి వైపున‌కు దూసుకువెళ్లింద‌ని ఆమె తెలిపింది. కాగా.. ఈప్ర‌మాదంలో ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. బాల‌య్య ఇంటి ద‌గ్గ‌ర ప్ర‌మాదంలో జ‌ర‌గ‌డంతో చూడ‌డానికి జ‌నం గుంపులుగా ఎగ‌బ‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

Next Story