కాంతారాలో హీరో క్యారెక్టర్ ను ఏ బాలీవుడ్ హీరో కూడా చేయలేరు

Rishab Shetty says no Bollywood actor can play his role in Kantara. రిషబ్ శెట్టి 'కాంతారా' సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వం

By Medi Samrat
Published on : 31 Oct 2022 8:30 PM IST

కాంతారాలో హీరో క్యారెక్టర్ ను ఏ బాలీవుడ్ హీరో కూడా చేయలేరు

రిషబ్ శెట్టి 'కాంతారా' సినిమా భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో ముఖ్యపాత్రలో నటించాడు. బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పలు హిందీ చిత్రాలను ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అధిగమించింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్‌లో తన పాత్రను ఏ బాలీవుడ్ నటుడు పోషించగలడని రిషబ్‌ను అడిగినప్పుడు.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎవరు చేయగలరో తాను ఊహించలేనని చెప్పాడు.

సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, రిషబ్‌ మాట్లాడుతూ.. హిందీలో రీమేక్ చేస్తే ఏ బాలీవుడ్ నటుడు కూడా తన పాత్రను ఎవరు సూట్ అవుతారని అడిగారు. దానికి రిషబ్ ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదని అన్నారు. నేను ఎవరి గురించి ఆలోచించలేను.. ఎందుకంటే నేను మరొక నటుడికి సన్నివేశాన్ని ఎలా వివరించాలో నాకు తెలియదు. నేను దైవ కోలా సీక్వెన్స్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇది భావోద్వేగ, ఆధ్యాత్మిక ప్రయాణం కాబట్టి నేను దీన్ని ఎలా చేశానో కూడా వివరించలేను. మీరు దానిని నమ్మాలి. మేము చిన్నప్పటి నుండి ఇవన్నీ చూస్తున్నామని చెప్పుకొచ్చాడు రిషబ్. బాలీవుడ్ లో మంచి నటులు ఉన్నారని.. కానీ తాను పోషించిన శివ క్యారెక్టర్ ఇక్కడి వారికి సరిపోలుతుందని తాను భావించలేదని అన్నాడు రిషబ్.


Next Story