మొక్క‌లు నాట‌మంటే..? నేను స్వార్థ‌ప‌రుడిని.. నా వ‌ల్ల కాద‌న్న వ‌ర్మ

RGV About Plants. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పలువురు మొక్కలు నాటుతూ.. పర్యావరాణాన్ని కాపాడుతున్నారు.

By Medi Samrat  Published on  11 Nov 2020 1:10 PM GMT
మొక్క‌లు నాట‌మంటే..? నేను స్వార్థ‌ప‌రుడిని.. నా వ‌ల్ల కాద‌న్న వ‌ర్మ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పలువురు మొక్కలు నాటుతూ.. పర్యావరాణాన్ని కాపాడుతున్నారు. ప్రస్తుతం దేశమంతా "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా త‌న నివాసంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్‌కుమార్‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ మొక్క‌లు నాటిన సంగ‌తి తెలిసిందే. ఆత‌రువాత ఆలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం స‌భ్యులను నామినేట్ చేశారు.


దీంతో ఈ రోజు ఆర్ఆర్ఆర్ ‌చిత్ర బృందం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటింది. అనంత‌రం చిరంజీవి ఆచార్య‌, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున పుష్ప సినిమాల యూనిట్లకు ఆర్ఆర్ఆర్ బృందం చాలెంజ్ విసిరింది. రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో రాంగోపాల్ వర్మ, వి.వి వినాయక్, పూరీ జగన్నాథ్ ల‌ను నామినేట్ చేశాడు. ఇక నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ.. రాజ‌మౌళి ట్వీట్‌కు వెంట‌నే స్పందించాడు.తాను ఈ ఛాలెంజ్‌లో పాల్గొన‌ను అని.. త‌న‌కు బుర‌ద అంటే ఇష్టం లేదు అని.. మంచి వ్య‌క్తులు మాత్ర‌మే మొక్క‌లు నాటుతార‌ని.. త‌న‌లాంటి వాళ్లు కాద‌ని త‌నదైన స్టైల్‌లో వ‌ర్మ ట్వీట్ చేశాడు. ''రాజమోళి సర్ నేను గ్రీన్ లో కానీ ఛాలెంజ్ లో కానీ లేను. అలాగే బురదను తాక‌డాన్ని ఇష్ట‌ప‌డ‌ను. మొక్కలు నాటడానికి మంచి వ్యక్తులు అర్హులు, నా లాంటి స్వార్థపూరితమైన వారు కాదు. మీకు మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్'' అని ట్విట్ చేసాడు వర్మ.


Next Story