వచ్చే దసరాకు అఖండ తాండవమే..!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

By Kalasani Durgapraveen  Published on  11 Dec 2024 8:15 PM IST
వచ్చే దసరాకు అఖండ తాండవమే..!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. సీక్వెల్‌కి అఖండ తాండవం అనే టైటిల్ కూడా పెట్టారు. అఖండ 2 చిత్రీకరణ అధికారికంగా మొదలైంది.

డిసెంబర్ 11న రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని 2025 దసరా సీజన్‌కు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 బాలకృష్ణ కెరీర్‌లో అతిపెద్ద వెంచర్. అఖండకు మంచి ఆదరణ లభించడంతో ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా కూడా విడుదల కానుంది. అఖండ-2 సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Next Story