భారీగా మోసపోయిన సీనియర్ నటుడు నరేష్.. ఎంత కోల్పోయారంటే..!
Real estate magnate owes our family Rs 10 Cr. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మోసపోయారు. ఈ విషయాన్ని ఆయనే పోలీసుల దృష్టికి తీసుకుని
By Medi Samrat Published on 18 April 2021 4:32 PM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మోసపోయారు. ఈ విషయాన్ని ఆయనే పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లారు. స్టోన్ ఇన్ ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్ అనే వ్యక్తిపై నరేశ్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ కు తమ కుటుంబంతో పరిచయం ఉందని, దాంతో అతడికి పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చామని నరేశ్ తెలిపారు. అతను తమకు దాదాపు రూ.10 కోట్లు చెల్లించాలని.. 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు శ్రీనివాస్ అప్పు చెల్లించకపోగా, తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. అందుకే సీసీఎస్ పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని నరేశ్ తెలిపారు. సదరు వ్యక్తి తమను ఎంతగానో ఇబ్బందులు పెట్టారని నరేష్ చెప్పుకొచ్చారు.
దాదాపు రూ.7.50 కోట్ల రూపాయలు ఇచ్చామని.. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వడం లేదని.. తనతో పాటూ బంధువులు కూడా మోసపోయారని నరేష్ చెప్పుకొచ్చారు. అతడిని అదుపులోకి తీసుకుని నాకు న్యాయం చేయాలని.. మా డబ్బు ఇప్పించండని కోరారు. నరేష్ కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి లింగం శ్రీనివాస్.. కీస్టోన్ అనే కంపెనీని నడుపుతున్నారు. కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమకు చెందిన బిల్డర్స్ ఫీనిక్స్ లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా శ్రీనివాస్ ఉన్నాడు. నరేష్ కుటుంబంతో కూడా శ్రీనివాస్ కు వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అతడు అడగటంతో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను హ్యాండ్ ఫైనాన్స్ రూపంలో నరేష్ ఇచ్చారు. దాదాపు ఆరేళ్ల క్రితం ఆ డబ్బులను ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకూ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదని నరేష్ చెప్పుకొచ్చారు. తనకు న్యాయం చేయాలని నరేష్ పోలీసులను కోరానని చెప్పుకొచ్చారు.