రవితేజతో క్రాక్-2 ఫిక్స్ : గోపీచంద్ మలినేని

Raviteja Krack-2 Movie Update. మాస్ మహారాజ్ రవితేజతో క్రాక్ 2 పై దర్శకుడు గోపీచంద్ మలినేని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

By Medi Samrat  Published on  22 May 2023 4:00 PM IST
రవితేజతో క్రాక్-2 ఫిక్స్ : గోపీచంద్ మలినేని

మాస్ మహారాజ్ రవితేజతో క్రాక్ 2 పై దర్శకుడు గోపీచంద్ మలినేని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2021లో వచ్చిన క్రాక్ గోపీచంద్ అండ్ రవితేజ కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఆ సినిమాకి ముందు ఇద్దరు ప్లాప్ లతో సతమతం అవుతున్నారు. దీంతో క్రాక్ సినిమా వీరిద్దరి కెరీర్ లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. కేవలం వారిద్దరికీ మాత్రమే కాదు. రవితేజ ఫ్యాన్స్ కి కూడా క్రాక్ సినిమా ఎంతో స్పెషల్. దీంతో వీరిద్దరి కాంబినేషన్ కోసం మరోసారి ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే క్రాక్ 2 గురించి ఫ్యాన్స్ ప్రశ్నించగా.. ‘తప్పకుండా ఉంటుంది. త్వరలోనే క్రాక్ 2తో రాబోతున్నా’ అంటూ దర్శకుడు గోపీచంద్ బదులిచ్చాడు. ఇక ఈ మాటలు విన్న రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో గోపీచంద్ అండ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమా సూపర్ హిట్టుగా నిలిచాయి. మరి ఈ క్రాక్ 2 ఎప్పుడు పట్టాలు ఎక్కబోతుందో చూడాలి.


Next Story