రివ్యూలు సరిగా రాకపోయినా.. కలెక్షన్స్ లో మాత్రం 'ధమాకా'నే..!

Raviteja Dhamaka Movie Collections. హీరో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన

By Medi Samrat  Published on  28 Dec 2022 5:04 PM IST
రివ్యూలు సరిగా రాకపోయినా.. కలెక్షన్స్ లో మాత్రం ధమాకానే..!

హీరో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్‌ 23ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ధమాకాను చూడడానికి అభిమానులు ఎగబడుతూ ఉన్నారు. తొలి రోజే రూ.10 కోట్ల గ్రాస్‌ వసూలు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో మొత్తం రూ.49 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఊపు కొనసాగితే మంచి లాభాలు అందించిన సినిమాగా నిలుస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందించారు. ఫస్ట్ హాఫ్ మాంచి ఎంటర్టైనర్ గా నిలిచినా.. సెకండాఫ్ మాత్రం రొటీన్ గానే అనిపించింది. అక్కడక్కడ పంచ్ లు పేలడం.. ప్రీ క్లైమాక్స్ ఫన్ ఉండడంతో సినిమాను అలా నెట్టుకొచ్చేశారు.


Next Story