లేఖ రాసిన రవితేజ 'ఈగల్' టీమ్.. న్యాయం చేయాల్సిందే..!

ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ విడుదలయ్యాయి.

By Medi Samrat  Published on  19 Jan 2024 9:00 PM IST
లేఖ రాసిన రవితేజ ఈగల్ టీమ్.. న్యాయం చేయాల్సిందే..!

ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ విడుదలయ్యాయి. వీటీతోపాటు రవితేజ నటించిన 'ఈగల్' సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తే రవితేజ ఈగల్ సినిమా నిర్మాతలు తప్పుకున్నారు. సంక్రాంతికి డ్రాప్ అయితే సోలో రిలీజ్ డేట్‌కు విడుదల చేసేలా ప్రయత్నిస్తానని దిల్ రాజు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో రవితేజ ఈగల్ మూవీ టీమ్ ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంది. అయితే ఫిబ్రవరి 9కి సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌గా వస్తోన్న యాత్ర 2 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ డేట్ గురించి ఫిల్మ్ ఛాంబర్‌కు ఈగల్ నిర్మాతలు లేఖ రాశారు.

2024 జనవరి 13న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈగిల్ సినిమా విడుదలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని అధికారికంగా ప్రస్తావించేందుకు తాను ఈ లేఖ రాస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఛాంబర్ పెట్టిన మీటింగ్‌లో నిర్మాతల్లో ఒకరు సినిమాను వాయిదా వేసుకోవాలని కోరారు. దాంతో ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నాం. ఛాంబర్ నుంచి హామీ తీసుకోవడం ద్వారా మాకు సోలోగా డేట్ దొరుకుతుందని భావించాం. ప్రెస్ మీట్ లో చాంబర్ అంగీకరించిన విధంగా జరుగుతుందని అనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు మేము అనుకుంటున్న రిలీజ్ డేట్‌కు ఎక్కువ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని పెద్దలు గమనించాలని, మాకు సోలో రిలీజ్ డేట్ కేటాయించేలా చూడాలని అభ్యర్తిస్తున్నామని నిర్మాతలు కోరారు.

Next Story