లాజిక్ తో కొడుతున్న రవితేజ 'ఈగిల్' నిర్మాతలు

సంక్రాంతికి భారీగా తెలుగులో సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఊహించని పోటీ నెలకొంది.

By Medi Samrat  Published on  27 Dec 2023 9:30 PM IST
లాజిక్ తో కొడుతున్న రవితేజ ఈగిల్ నిర్మాతలు

సంక్రాంతికి భారీగా తెలుగులో సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఊహించని పోటీ నెలకొంది. విడుదల కోసం నిర్మాతల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఎవరూ తమ సినిమాను వాయిదా వేయడానికి సిద్ధంగా లేరు. సైంధవ్, నా సామి రంగ విడుదల కోసం తమ రిలీజ్ డేట్ ను ఎందుకు త్యాగం చేయాలని అంటున్నారు రవితేజ 'ఈగిల్' నిర్మాతలు.

నిర్మాతల మండలి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల రిలీజ్ డేట్ లను మార్చేందుకు ప్రయత్నించింది, కానీ హనుమాన్ టీమ్ గతంలో చెప్పినట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల వాయిదా పడదని తేల్చేశారు. అన్ని భాషలలో 12 వ తేదీకి అగ్రిమెంట్ చేసుకున్నామని.. విడుదల తేదీని మార్చలేమని హనుమాన్ సినిమా టీమ్ స్పష్టం చేసింది. సినిమాను వాయిదా వేయాలని ఈగిల్ టీమ్‌ని మండలి కోరగా, సినిమాను ఎందుకు వాయిదా వేయాలని టీమ్ ప్రశ్నించింది. క్రిస్‌మస్‌కి విడుదల చేయాల్సిన సైంధవ్‌ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని ఎందుకు మార్చుకున్నారో చెప్పాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈగల్ సినిమా నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీని జనవరి 13వ తేదీని ముందుగా ప్రకటించామని.. అందుకే రిలీజ్ డేట్ మార్చడానికి అంగీకరించలేదన్నారు. టీమ్ సైంధవ్‌ను వాయిదా వేయమని సభ్యులు ఎందుకు అడగలేదని వారు కౌన్సిల్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ఈగల్ సినిమా మేకర్స్ సోలో రిలీజ్ కోసం అందరికన్నా ముందే జనవరి 13న ప్రకటించారని తెలుస్తోంది. సైంధవ్ సినిమా రిలీజ్ డేట్ తర్వాత ప్రకటించారు. ఈ విషయంలో నా సామి రంగా రిలీజ్ తేదీని కూడా ముందే ప్రకటించలేదని వారి వాదన.

Next Story