సైన్యంలో చేరనున్న‌'శివారెడ్డి' కూతురు..!

Ravi Kishan’s daughter Ishita to join defense forces under Agnipath scheme. తెలుగు వారికి సుప‌రిచితుడైన‌ భోజ్‌పురి న‌టుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు.

By Medi Samrat  Published on  27 Jun 2023 5:23 PM IST
సైన్యంలో చేరనున్న‌శివారెడ్డి కూతురు..!

తెలుగు వారికి సుప‌రిచితుడైన‌ భోజ్‌పురి న‌టుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఎందుకంటే రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా తన కలను నెరవేర్చుకోనుంది. ఆమె సైన్యంలో చేరబోతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భోజ్‌పురి నటుడు రవికిషన్ కుమార్తె 21 ఏళ్ల కుమార్తె ఇషితా శుక్లా అగ్నిపథ్ పథకం కింద రక్షణ దళంలో చేరనున్నారు అనే శీర్షికతో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.


గత సంవత్సరం రవి కిషన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. అందులో.. నా కుమార్తె ఇషితా శుక్లా, ఈ ఉదయం.. నాన్న, నేను కూడా అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరాలనుకుంటున్నాను చెప్పింది. నేను.. తప్పకుండా వెళ్ళు అన్నాను అని చెప్పిన‌ట్లు పోస్ట్‌ను షేర్ చేశాడు.

అగ్నిపథ్ యోజన కింద 4 సంవత్సరాల పాటు జవాన్లను నియమిస్తామని మోదీ ప్రభుత్వం గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, 75 శాతం మంది సైనికులకు ఉన్నత విద్య లేదా పోలీసు సేవల పునరుద్ధరణ లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన పారామిలటరీ బలగాలలో వారి ఆసక్తిని బట్టి ప్రాధాన్యతా నియామకం ఇవ్వబడుతుంది. మిగిలిన సైనికులను శాశ్వత పోస్టులలో నియమిస్తారు.

రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఎన్‌సీసీ క్యాడెట్. ఆమె 26 జనవరి 2023న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా పాల్గొంది. ఇందుకుగానూ ఆమెను సత్కరించారు. ఇషిత తండ్రి రవి కిషన్ తన కుమార్తెకు సన్మానం చేసిన సమాచారాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. రేసుగుర్రంలో మ‌ద్దాలి శివారెడ్డిగా క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన రవి కిషన్.. ఆ త‌ర్వాత చాలా సినిమాల‌లో న‌టించి టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.


Next Story