నేను ప్ర‌యాణాల్లో ఎన్నో వేధింపుల‌కు.. ఈవ్ టీజింగ్‌కు గురయ్యాను : రవీనా టాండన్

Raveena Tandon hits back at trolls questioning her privilege. రవీనా టాండన్.. కేజీఎఫ్-2 లో రమిక సేన్ పాత్రలో అద్భుతంగా మెప్పించి ప్రశంసలు

By Medi Samrat  Published on  3 July 2022 9:32 AM
నేను ప్ర‌యాణాల్లో ఎన్నో వేధింపుల‌కు.. ఈవ్ టీజింగ్‌కు గురయ్యాను : రవీనా టాండన్

రవీనా టాండన్.. కేజీఎఫ్-2 లో రమిక సేన్ పాత్రలో అద్భుతంగా మెప్పించి ప్రశంసలు అందుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ ను తన గ్లామర్ తో ఊపేసిన రవీనా.. సెకండ్ ఇన్నింగ్స్ లో ధీటైన పాత్రలు చేయగలనని ఘనంగా చాటి చెప్పింది. తాజాగా ఆమె ముంబై లోకల్‌లో ప్రయాణించిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. మెట్రో 3 కార్ షెడ్‌ను ముంబైలోని ఆరే అటవీ ప్రాంతానికి మార్చాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రవీనా టాండన్ మెట్రోలో తనకు జరిగిన అనుభ‌వాన్ని షేర్ చేసుకున్నారు.

సోషల్ మీడియాలో అభివృద్ధికి వ్యతిరేకంగా కొందరు అడ్డుకుంటూ ఉన్నారని నెటిజన్ విమర్శలను గుప్పించాడు. దియా మీర్జాతో పాటు రవీనా టాండన్‌ను ట్యాగ్ చేశారు. రవీనా స్పందిస్తూ.. లోకల్ రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు తాను కూడా ఈవ్ టీజ్‌కి గురయ్యానని, ఎన్నో వేధింపులకు గురయ్యానని చెప్పింది. టీనేజ్ లో తాను లోకల్ ట్రైన్స్ /బస్సులలో ప్రయాణించానని.. ఈవ్ టీజింగ్ లు మాత్రమే కాదు.. కొందరు తనను అసభ్యంగా తాకారని కూడా ఆమె చెప్పింది. కష్టపడి నా మొదటి కారును 92లో సంపాదించాను. అభివృద్ధి అనేది స్వాగతించదగినది, ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, మనం ఎక్కడ ఉన్నా బాధ్యత వహించాలి. పర్యావరణం/వన్యప్రాణులను రక్షించడానికి అడవులను నరికివేయకూడదని చెప్పుకొచ్చింది. ప్రకృతిని తక్కువగా అంచనా వేస్తే.. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని క్లాస్ పీకింది.










Next Story