ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రవీనా టాండన్‌కు ఊహించని ఇబ్బంది ఎదురైంది. ఆమె తనను తాను రక్షించుకునేందుకు చాలానే కష్టపడింది. ఒక మహిళ ముక్కు నుండి రక్తం కారుతుందని ఫిర్యాదు చేయగా.. తనను కొట్టవద్దని రవీనా వారిని వేడుకుంది. రవీనా ఈ సంఘటనను రికార్డ్ చేయడం ఆపివేయమని అక్కడ ఉన్నవారిని కోరింది. తన డ్రైవర్‌ను రక్షించేందుకు రవీనా తాగిన మత్తులో జోక్యం చేసుకుందని.. ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అయితే కారు ఎవరికీ తగలలేదని నివేదికలు సూచిస్తున్నాయి. పోలీసులు కూడా దాడి జరిగిందని.. ఎవరికైనా తలకు గాయాలయ్యాయనే వాదనలను తోసిపుచ్చారు.
నటి రవీనా టాండన్‌పై ఖార్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. రవీనా తాగి, ర్యాష్ డ్రైవింగ్, దాడికి పాల్పడినట్లు ఎలాంటి ఎలాంటి ఆధారాలు లేవని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తప్పుడు ఫిర్యాదు చేశారని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత రవీనా కారు ఎవరినీ ఢీకొట్టలేదని, ఆమె తాగలేదని తేలిందని తెలుస్తోంది.