ఎరుపు రంగు లెహంగాలో తళుక్కుమన్న రష్మిక

Rashmika Mandanna walked the ramp in a dreamy red lehenga. మంగళవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌డిసిఐ ఇండియా కోచర్ వీక్-2022

By Medi Samrat
Published on : 27 July 2022 5:38 PM IST

ఎరుపు రంగు లెహంగాలో తళుక్కుమన్న రష్మిక

మంగళవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌డిసిఐ ఇండియా కోచర్ వీక్-2022లో రష్మిక మందన్న ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆకట్టుకుంది. రష్మిక డిజైనర్ వరుణ్ తీర్చిదిద్దిన బ్రైడల్ రెడ్ లెహెంగాలో ర్యాంప్‌ వాక్ చేసింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలి కాలంలో రష్మిక బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు రష్మిక మందన్న ర్యాంప్‌ వాక్ గురించి కూడా బాలీవుడ్ సర్కిల్స్ లో తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సరికొత్త లుక్‌తో రష్మిక పలువురిని ఆకట్టుకుంటూ ఉంది.

అంతకు ముందు రష్మిక మందన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌లో దిగిన హాట్‌ ఫోటోలను పంచుకుంది. క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ, పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. రష్మిక మందన్నా బాలీవుడ్‌ హీరోయిన్ అయ్యేందుకు చాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మూడు భారీ సినిమాల్లో నటిస్తుంది. `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` చిత్రాలతోపాటు రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి `యానిమల్‌` సినిమా చేస్తుంది.











Next Story