శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేరా' సినిమాతో మంచి విజయాన్ని సాధించిన రష్మిక మందన్న ఇప్పుడు మరో సినిమాలో అవకాశాన్ని అందుకుంది. తాజా నివేదికల ప్రకారం రష్మిక మందన్న 'AA22' సినిమా కోసం మళ్ళీ అల్లు అర్జున్ తో చేతులు కలిపిందని తెలుస్తోంది. అట్లీ తదుపరి ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్, దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా రష్మిక నటించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సిరీస్ లో నటించిన రష్మికను ఈ సినిమాలో కూడా తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీపిక, జాన్వి, రష్మిక, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. AA22xA6 భారీ చిత్రం అని చెబుతున్నారు. సాంకేతికంగా అద్భుతంగా ఉండబోతోందని నమ్ముతున్నారు.