కాలికి గాయం కావడంతో.. దర్శకులకు క్షమాపణలు చెప్పిన రష్మిక మందన్న

ఇటీవల నటి రష్మిక మందన్న కాలికి గాయమైంది. ఈ క్రమంలోనే తన అభిమానులకు హెల్త్ అప్‌డేట్ అందించింది.

By Knakam Karthik  Published on  12 Jan 2025 2:58 PM IST
Rashmika Mandanna, leg injury, directors, Bollywood, Tollywood

కాలికి గాయం కావడంతో.. దర్శకులకు క్షమాపణలు చెప్పిన రష్మిక మందన్న

ఇటీవల నటి రష్మిక మందన్న కాలికి గాయమైంది. ఈ క్రమంలోనే తన అభిమానులకు హెల్త్ అప్‌డేట్ అందించింది. ప్రస్తుతం సినిమా షూట్‌లతో బిజీబిజీగా ఉన్న రష్మిక.. తన పరిస్థితి గురించి తెలియజేయడానికి సోషల్ మీడియాలో లాంగ్ నోట్‌తో పాటు చిత్రాలను పంచుకున్నారు. తన పోస్ట్‌లో, ఆమె తన గాయం కారణంగా ఆలస్యం అయినందుకు.. తన కొనసాగుతున్న సినిమా ప్రాజెక్టుల దర్శకులకు క్షమాపణలు చెప్పింది. విచారం వ్యక్తం చేసింది. త్వరితగతిన షూటింగ్‌ చేరేందుకు వైద్య సలహాను అనుసరించి తాను కోలుకునే మార్గంలో ఉన్నానని రష్మిక తన అభిమానులకు తెలిపింది.

ఈ సమయంలో ఆమె తన మద్దతుదారులకు వారి ఆందోళన, అవగాహనకు కృతజ్ఞతలు తెలిపింది. వీలైనంత త్వరగా సెట్‌కి తిరిగి రావడానికి తన నిబద్ధతను నొక్కి చెప్పింది. ఈ అమ్మడు ఇటీవలే విడుదలైన 'పుష్ప-2' సినిమాలో నటించింది. రష్మిక ప్రస్తుతం థమ, సికిందర్, కుబేర చిత్రాలలో నటిస్తున్నారు. ఆమెతో పాటు సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ 2025 ఈద్ రోజున విడుదల కానుండగా, క్రైమ్-థ్రిల్లర్ కుబేర ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అదే సమయంలో, రక్త పిశాచి చిత్రం థామలో రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా నటించారు.

Next Story