రష్మిక బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Rashmika Mandanna shares first poster of Goodbye with Amitabh Bachchan. రష్మిక మందాన.. దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా వెలుగొందుతూ ఉంది.
By Medi Samrat Published on 3 Sept 2022 2:45 PM ISTరష్మిక మందాన.. దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా వెలుగొందుతూ ఉంది. బాలీవుడ్ లో కూడా రష్మిక వరుస సినిమాలను చేయడానికి సిద్ధమై ఉంది. అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా రష్మిక నటిస్తోందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. చూస్తుంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వైబ్స్ వస్తున్నాయి.
అమితాబ్ బచ్చన్, రష్మిక మందాన ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం 'గుడ్‌బై'. ఇందులో వారు జీవితం, కుటుంబ విలువలు, సంబంధాల గురించి తెలియజేయనున్నారు. వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిలించే కథ అని చెబుతున్నారు. ఈ చిత్రం నుండి మొదటి పోస్టర్ నేడు విడుదలైంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రష్మికలు తండ్రీ కూతుళ్ల పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. గుడ్ బై నుండి వచ్చిన మొదటి పోస్టర్‌లో.. అమితాబ్ బచ్చన్, రష్మిక కలిసి గాలిపటం ఎగురవేస్తూ నవ్వుతూ కనిపించారు. మంచి భావోద్వేగాలతో కూడిన చిత్రమని భావిస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ ను చిత్ర బృందం తమ సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు.
గుడ్ బై సినిమాను ఏక్తా కపూర్ నిర్మించారు. వికాస్ భల్ దర్శకత్వం వహించిన గుడ్‌బైలో అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. గుడ్‌బై సినిమా అక్టోబర్ 7, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.