పుష్ప-2 లో శ్రీవల్లి.. చూపే బంగారమాయెనే..!

'పుష్ప 2'లో శ్రీవల్లిగా చేస్తోంది రష్మిక మందాన. ఆమె ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించారు అధికారులు. ఏప్రిల్ 5 న రష్మిక పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేశారు

By Medi Samrat  Published on  5 April 2024 8:15 PM IST
పుష్ప-2 లో శ్రీవల్లి.. చూపే బంగారమాయెనే..!

'పుష్ప 2'లో శ్రీవల్లిగా చేస్తోంది రష్మిక మందాన. ఆమె ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించారు అధికారులు. ఏప్రిల్ 5 న రష్మిక పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో శ్రీవల్లిగా పట్టు చీరతో, బంగారు ఆభరణాలతో కనిపించింది. 'పుష్ప 2' టీజర్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజున ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'పుష్ప: ది రూల్' సినిమా కోసం టాలీవుడ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' సినిమా మొదటి భాగం గ్లోబల్ లెవెల్లో యూఫోరియా క్రియేట్ చేయడంతో పాటు మాస్‌లోకి బాగా వెళ్ళింది. 'పుష్ప 2: ది రూల్' ఆగస్టు 15న సినిమాల్లో విడుదల కానుంది.

కొన్నిరోజుల క్రితం మూవీ సెట్ నుంచి లీక్ అయిన ర‌ష్మిక ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్న పుష్ప‌-2 తో పాటు ది గ‌ర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో చిత్రాల్లో కూడా న‌టిస్తోంది.

Next Story