ప్రేమ‌, పెళ్లిపై ర‌ష్మిక స్పంద‌న‌.. కాబోయేవాడి గురించి ఏం చెప్పిందంటే

Rashmika Mandanna opens up about her ideal partner.ఛ‌లో చిత్రంతో టాలీవుడ్‌లో తెర‌గ్రేటం చేసిన క‌న్నడ బ్యూటీ ర‌ష్మిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 1:46 PM IST
ప్రేమ‌, పెళ్లిపై ర‌ష్మిక స్పంద‌న‌.. కాబోయేవాడి గురించి ఏం చెప్పిందంటే

'ఛ‌లో' చిత్రంతో టాలీవుడ్‌లో తెర‌గ్రేటం చేసిన క‌న్నడ బ్యూటీ ర‌ష్మిక మందన్నా. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. ఆమె న‌టించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రం ఈ నెల‌ 25న విడుదల కానుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. త‌నకు కాబోయే భ‌ర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.

ఎవరి దగ్గర ఉంటే మ‌నం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు భావిస్తామో కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామ‌ని అనిపిస్తుందో అతడే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్ అని చెప్పుకొచ్చింది. తాను అలాండి వాడినే ఎంచుకుంటాన‌ని తెలిపింది. ఇక ప్రేమ‌ను వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మంది. 'ఎందుకంటే అది పూర్తిగా భావోద్వేగాల‌కు సంబంధించింది. ఇక నా దృష్టిలో ప్రేమంటే ఒకరికొక‌రు గౌర‌వం, స‌మ‌యాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం, ఒక‌రిపై మ‌రొక‌రికి పూర్తి న‌మ్మ‌కం ఏర్ప‌డ‌టం. ఈ బావోద్వేగాలు ఇద్ద‌రి వైపు నుంచి ఉన్న‌ప్పుడే వాళ్ల ప్రేమ విజ‌యం సాధిస్తుంద'ని తెలిపింది. ఒకవేళ తాను ప్రేమ వివాహం చేసుకుంటే ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటానని చెప్పింది.

క‌న్న‌డ హీరో ర‌క్షిత్‌శెట్టితో ర‌ష్మిక‌కు నిశ్చితార్థం జ‌రిగింది. అయితే.. అనుకోని కార‌ణాల వ‌ల్ల వారు విడిపోయారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక త‌న కెరీర్‌పై పుల్ ఫోక‌స్ పెట్టింది. ఇదిలా ఉంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక ప్రేమ‌లో ఉన్న‌ట్లు.. వారిద్ద‌రూ డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

Next Story