రెడ్ డ్రెస్ లో మెరిసిపోయిన రష్మిక..

Rashmika Mandanna looks ravishing in red Dress. రష్మిక మందన్న మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్‌కు హాజ‌రైంది.

By Medi Samrat
Published on : 16 July 2022 3:30 PM IST

రెడ్ డ్రెస్ లో మెరిసిపోయిన రష్మిక..

రష్మిక మందన్న మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్‌కు హాజ‌రైంది. రెడ్ డ్రెస్‌లో ఆమె సందడి చేసింది. దీంతో ఫొటోగ్రాఫ‌ర్స్ ర‌ష్మికను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీలు ప‌డ్డారు. ర‌ష్మిక ఫొటో సెష‌న్‌ను పూర్తి చేసి ఈవెంట్‌లోకి వెళ్లిపోయింది.ఇప్పుడామె ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతోంది.

హెచ్‌టి ఇండియా యొక్క మోస్ట్ స్టైలిష్ 2022 అవార్డ్స్ కు రష్మిక హాజరైనప్పుడు లెజెండరీ నటులు అనుపమ్ ఖేర్ కూడా అక్కడకు వచ్చారు. ఆ సమయంలో ఒకరినొకరు పలకరించుకున్నారు. అనుపమ్ ఖేర్ తన ఫోన్‌ను వేరే వాళ్లకు ఇచ్చి రష్మికతో తన చిత్రాన్ని క్లిక్ చేయమని అడిగాడు. అనుపమ్‌తో కలిసి కెమెరాలకు పోజులిచ్చే ముందు రష్మిక నవ్వుతూ కనిపించింది. మోస్ట్ స్టైలిష్ హాట్‌స్టెప్పర్ అవార్డును గెలుచుకున్న రష్మిక మందన్న ఈవెంట్‌లో స్వీట్ స్పీచ్ ఇచ్చింది.

ప్రస్తుతం ర‌ష్మిక మంద‌న్న‌ బాలీవుడ్‌లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. వ‌రుస సినిమాలు చేస్తూ ఉంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై చిత్రాల్లో నటించింది. ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో క‌లిసి యానిమ‌ల్ సినిమాలో నటించబోతోంది రష్మిక.













Next Story