పైస‌ల‌ బ్యాగ్ తో రష్మిక.. అంత డబ్బు ఏమి చేస్తుంది..!

ధనుష్, నాగార్జున అక్కినేని నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం "కుబేర". ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

By Medi Samrat  Published on  5 July 2024 7:45 PM IST
పైస‌ల‌ బ్యాగ్ తో రష్మిక.. అంత డబ్బు ఏమి చేస్తుంది..!

ధనుష్, నాగార్జున అక్కినేని నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం "కుబేర". ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌తో పాటు ఆమె పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో దాచిన డబ్బును రష్మిక పాత్ర తీసుకుని వెళ్లడం మనం గమనించవచ్చు. అంత డబ్బు ఆమెకు ఎందుకు.. ఎక్కడి నుండి వచ్చిందనే క్యూరియాసిటీ పెంచుతోంది.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 'కుబేర' షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొద్దిరోజుల కిందట ముంబైలో షూటింగ్ ముగిసింది. ఈ సినిమా అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

Next Story