నా ఫేవరెట్ టీమ్ అదే.. కానీ.. కోహ్లీకి అభిమానిని కాదు

Rashmika About Favourite IPL Cricket Team. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ర‌ష్మిక ఐపీఎల్ గురించి పెద‌వి విప్పింది. త‌న ఫేవ‌రేట్ టీమ్‌.. ప్లేయ‌ర్ గురించి అభిమానుల‌తో పంచుకున్న‌ది.

By Medi Samrat  Published on  17 May 2021 4:07 PM GMT
Rashmika About Favourite IPL

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ లీగ్‌కు అభిమానులు ఉన్నారు. సినిమా స్టార్స్ నుండి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ స్టార్స్ ఏకంగా ప్రాంఛైజీ భాగ‌స్వామ్యులుగా ఉండ‌గా.. టాలీవుడ్ నుండి మాత్రం మ్యాచ్‌ల‌కు హాజ‌ర‌వుతూ త‌న అభిమానాన్ని చాటుకుంటున్నారు స్టార్స్‌. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ర‌ష్మిక ఐపీఎల్ గురించి పెద‌వి విప్పింది. త‌న ఫేవ‌రేట్ టీమ్‌.. ప్లేయ‌ర్ గురించి అభిమానుల‌తో పంచుకున్న‌ది.

రష్మిక మాట్లాడుతూ.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్ అని పేర్కొంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం నా ఫేవరెట్ క్రికెటర్ కాదని.. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీకి నేను వీరాభిమానిని తెలిపింది. ధోనీ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, కెప్టెన్సీ నాకు చాలా ఇష్టం. అతనో మాస్టర్‌ క్లాస్‌ ప్లేయర్‌. క్రికెట్‌లో ధోనీ నా ఆల్‌టైమ్‌ హీరో అని రష్మిక చెప్పుకొచ్చింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందని అనుకున్నానని.. అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్‌ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది.
Next Story