ఆదిత్య ధర్ దర్శకత్వం వహించినయాక్షన్ డ్రామా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఈ చిత్రం విదేశాలలో, భారతదేశంలోనూ బాగా వసూళ్లు సాధిస్తోంది. కానీ పలు దేశాలలో ఈ సినిమాను నిషేధించారు. “ఫైటర్” “టైగర్ 3” వంటి చిత్రాలు గల్ఫ్ దేశాల్లో విడుదలకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు “ధురంధర్” బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇలలో నిషేధాన్ని ఎదుర్కొంది.
ఈ చిత్రం మొదటి వారంలో 300 కోట్లకు పైగా వసూలు చేసింది. గల్ఫ్ దేశాల మార్కెట్ బాలీవుడ్ చిత్రాలకు భారీ మార్కెట్, ఈ దేశాలలో విడుదల కాకపోవడం సినిమా కలెక్షన్లపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది.