బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కొద్దిరోజుల కిందట చేసిన న్యూడ్ ఫోటో షూట్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. రణవీర్ సింగ్ పై కేసులు కూడా నమోదు చేశారు. మహిళల మనోభావాలను కించపరిచాడంటూ ఓ స్వచ్ఛంద సంస్థ చెంబూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్ 292, సెక్షన్ 293, సెక్షన్ 509, ఇన్పర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 67ఏ కింద బాలీవుడ్ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఈ నెల 22న వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరారు.
రణవీర్ సింగ్ పోలీసులకు ఎదుట హాజరయ్యేందుకు రెండువారాల సమయం కోరాడు. దీంతో పోలీసులు విచారణకు మరో తేదీని ఖరారు చేసి.. రణ్‌వీర్ సింగ్‌కు నోటీసులు జారీ చేయనున్నారు. రణవీర్ సింగ్.. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరియు విచారణలో పాల్గొనేందుకు తనకు కొంత సమయం కావాలని అభ్యర్థించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆగస్టు 12న చెంబూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రణ్‌వీర్ సింగ్ నివాసానికి వెళ్లి విచారణలో పాల్గొనమని నోటీసు ఇచ్చారు, అతను ముంబైలో లేడని తెలుసుకున్నారు. స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆఫీస్ బేరర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెలలో చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో రణవీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.