అభిమాని ఫోన్ తీసుకుని విసిరేసిన రణ్‌బీర్ కపూర్.. వీడియో వైరల్
Ranbir Kapoor Throws Away Fan's Phone.రణ్‌బీర్ కపూర్ తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన యువకుడి ఫోన్‌ను
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2023 8:25 AM ISTసినీ తారలకు చాలా మంది అభిమానులు ఉంటారు. వారు ఎక్కడికి వెళ్లినా సరే అభిమానులు సెల్ఫీలు అని వెంటపడడం చూస్తుంటాం. అయితే.. ఒక్కొక్క సారి సినీ తారలు అభిమానులతో ప్రవర్తించే తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన యువకుడి ఫోన్‌ను తీసుకుని పడేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రణ్‌బీర్ తో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. రణ్‌బీర్ కూడా నవ్వుతూ సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. అయితే.. ఫోటో సరిగా రాలేదో లేక ఫోన్ సరగ్గా పనిచేయలేదో తెలీదు గానీ, ఆ అభిమాని మరోసారి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ఈ సారి కూడా రణ్‌బీర్ సహకరించాడు. ఇలా రెండు మూడు సార్లు సెల్ఫీ తీసుకునేందుకు ఆ అభిమాని ప్రయత్నించాడు. దీంతో రణ్‌బీర్‌కు చిరాకు వచ్చినట్లుగా ఉంది. వెంటనే సదరు అభిమాని ఫోన్‌ను అడిగాడు.
Shocking 😱 Ranbir Kapoor THROWS Fan's Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— $@M (@SAMTHEBESTEST_) January 27, 2023
ఫోన్ ఇవ్వగానే వెనక్కు విసిరేశాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్న విషయాలు తెలియవు గానీ నెటీజన్లు ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. అంత య్యాటిట్యూట్ అవసరం లేదంటూ కొందరు రణ్‌బీర్ చేసిన పనిని తప్పు పడుతుంటే మరికొందరు మాత్రం ఏదో కొత్త మొబైల్ ప్రమోషనల్ అయి ఉంటుందని అంటున్నారు. మరీ అసలు విషయం ఏమిటనేది తెలియాల్సి ఉంది.