చెప్పుతో కొట్టబోయిన రమ్య.. విజిల్స్ వేసిన నరేష్

Ramya attempt to attack with slipper on Naresh and Pavithra Lokesh. కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారింది

By Medi Samrat  Published on  3 July 2022 3:30 PM IST
చెప్పుతో కొట్టబోయిన రమ్య.. విజిల్స్ వేసిన నరేష్

కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. మైసూర్ లో నరేష్- పవిత్ర వున్నారనే విషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడకు వెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. మూడో భార్య రమ్య వైపు చూస్తూ నరేష్ విజిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వ‌చ్చిన పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. త‌మ‌పై దాడి చేసేందుకు య‌త్నించిన ర‌మ్య‌ను మ‌రింత‌గా ఉడికించేందుకు న‌రేశ్ యత్నించాడు. ర‌మ్య‌ను చూసి విజిల్ వేస్తూ ఆయ‌న వెళ్లిపోయాడు. చేయి ఊపుతూ, ర‌మ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు. త‌న భ‌ర్త‌ను త‌న‌కు ద‌క్క‌కుండా ప‌విత్రా లోకేశ్ చేస్తోంద‌ని.. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే న‌రేశ్... ప‌విత్రా లోకేశ్‌ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ర‌మ్య ప్ర‌శ్నిస్తోంది.










Next Story