స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్' టీజ‌ర్

Ramraj For Bheem Teaser Creates Records. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్

By Medi Samrat  Published on  29 Nov 2020 11:50 AM IST
స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్న రామరాజు ఫర్‌ భీమ్ టీజ‌ర్

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్లే రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. వీరిద్దరి వేర్వేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. దాదాపు 80శాతానికిపైగా షూటింగ్ పూర్తైంది.

అక్టోబర్‌ 22న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదలైన "రామరాజు ఫర్‌ భీమ్‌" టీజర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ టీజర్‌ ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు వచ్చిన టీజర్‌ టాలీవుడ్‌లో చరిత్రలో ఇది వరకు లేదు. ఇక ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 3 కోట్ల 26 లక్షల వ్యూస్‌ రాగా... 11 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ టీజర్‌లో ఎన్టీఆర్ కొమురం భీంగా అదరగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఈ టీజ‌ర్‌పై వివాదం రాజుకుంది. ఆదివాసులను కించ పరిచేలా ఉందని బీజేపీ ఈ టీజర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ సినిమా విడుద‌ల‌ను ఆపుతామ‌ని కూడా బీజేపీ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.



Next Story