నాని సినిమా రికార్డ్ బ్రేక్ చేయనున్న రామ్ 'స్కంద'..!
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్కంద'
By Medi Samrat Published on 25 Sept 2023 9:30 PM ISTరామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్కంద' సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి అంచనాలు భారీ పెరుగుతూ ఉన్నాయి. బోయపాటి స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి రామ్ మేక్ఓవర్ స్కందకు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ కాంబో ఖచ్చితంగా టైర్ 2 హీరోలలో రికార్డ్ ఓపెనింగ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తాయని భావిస్తున్నారు.
ఓవర్సీస్, ప్రధాన నగరాల్లో ఓపెనింగ్స్ మాత్రం టాక్, రివ్యూల మీద ఆధారపడి ఉంటుంది. నాని హీరోగా వచ్చిన దసరా ఇప్పటి వరకు టైర్ 2 హీరోలకు అతిపెద్ద ఓపెనర్‌గా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల షేర్‌తో ప్రారంభమైంది. స్కంద దీనిని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి స్కందను నిర్మించారు. రామ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో శ్రీ లీల కథానాయికగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనుంది. ZEE స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తున్నారు. ఇక తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.