అరియానా గెలుపు కోసం కృషి చేస్తున్న స్టార్ డైరెక్టర్

Ram Gopal Varma Tweet About Ariana. ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసిందో.. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో

By Medi Samrat  Published on  9 Dec 2020 8:27 PM IST
అరియానా గెలుపు కోసం కృషి చేస్తున్న స్టార్ డైరెక్టర్

ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసిందో.. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయిపోయింది. వర్మ అరియానాకు పులిహోర కలపడం.. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తెలిసిందే..! కట్ చేస్తే.. కొద్దిరోజులకు అరియానా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. ఆమె కూడా చాలా కాలం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ అరియానా గురించి స్పందించారు. అభిజిత్, సొహైల్, అఖిల్, హారిక, మోనల్, అరియానాలు షోలో మిగిలారు. తొలి ఫైనల్ కంటెస్టెంట్ గా అఖిల్ నిలిచాడు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం ఆసక్తికరంగా మారడంతో అరియానాకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు పలికాడు. అరియానాకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచే అర్హత అరియానాకు ఉందని ట్వీట్ చేశాడు. దీంతో పాటు అరియానాకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.

అప్పట్లో అరియానా వ‌ర్మ‌ను ఇంట‌ర్వ్యూ చేయగా.. అరియానా.. ఈ మ‌ధ్య మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించింది అని అడిగింది. నువ్వే అని వ‌ర్మ సూటిగా స‌మాధాన‌మిచ్చారు. త‌ర్వాత అరియానా పేరు మార్మోగిపోయింది. సార్ పులిహోర మామూలుగా కలపడు అని నెటిజన్లు చెప్పుకున్నారు.




Next Story