దేశవ్యాప్తంగా రణవీర్ ఫోటోషూట్ పై చర్చ నడుస్తోంది. కొందరు ఆయనకు మద్దతు తెలుపుతుంటే.. మరి కొందరు మాత్రం రణవీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ముంబైలో రణవీర్ పై ఫిర్యాదు చేశారు. అయితే బాలీవుడ్ స్టార్‌కు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్రిహోత్రి అండగా నిలిచారు. రణవీర్ పై ఎఫ్ఐఆర్ అనేది కేవలం తెలివితక్కువ ఎఫ్ఐఆర్ అన్నారు. " ఇది చాలా తెలివి తక్కువ ఎఫ్ఐఆర్. ఎటువంటి కారణం లేకుండానే కేవలం ప్రజలను ఆకర్షించడానికి వేసిన కేసు మాత్రమే. ఆ ఎఫ్ఐఆర్ లో మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు అని రాశారు. సరే ఇప్పుడు చెప్పండి. నేను స్త్రీల నగ్న ఫోటోలను చాలా చూశాను. మరీ ఆ చిత్రాల వల్ల పురుషుల మనోభావాలను దెబ్బతినవా ?.. ఇది ముర్ఖపు వాదన." అని ఆయన చెప్పుకొచ్చారు. మన సంస్కృతిలో మానవ శరీరానికి గౌరవం ఉంది. ఇది భగవంతుడి అత్యంత అందమైన సృష్టి.. అని ఆయన అన్నారు.
ఇక దీనిపై దర్శకుడు ఆర్జీవీ కూడా స్పందించారు. రణవీర్ న్యూడ్ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. "నాకు తెలిసి లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్‌వీర్ ఇలా ఫొటోషూట్ చేసి ఉంటాడు. మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది, పురుషులు చూపిస్తే తప్పా?. మహిళలతో సమానంగా మగవారికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల కోసమే రణవీర్ ఇలా చేశాడు" అని ట్వీట్ చేశారు ఆర్జీవీ. మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే కూడా అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్ క్వశ్చన్ కూడా ఆర్జీవీ పెట్టారు.