వామ్మో వర్మ-కంగనా రనౌత్ ట్విట్టర్ సంభాషణ చూశారా..?

Ram Gopal Varma is mighty impressed with Kangana Ranaut's performance in Thalaivi. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంగనా రనౌత్ నటనను పొగిడారు. ఇక కంగనా కూడా వర్మ ట్వీట్ పై స్పందించింది.

By Medi Samrat  Published on  25 March 2021 1:31 PM IST
Ram Gopal Varma is mighty impressed with Kangana Ranauts performance in Thalaivi

కంగనా రనౌత్ ఎక్కువగా వార్తల్లో ఉన్నప్పటికీ.. సినిమాల పరంగా మాత్రం అద్భుతమైన నటి..! ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక లాంటి సినిమాలను చూస్తే కంగనా లోని నటి మనకు కనిపిస్తుంది. అందుకే ఆమెకు నేషనల్ అవార్డ్స్ కూడా దాసోహం అవుతూ ఉంటాయి. ఇక ఆమె మరో గొప్ప ప్రాజెక్టుతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. అది 'తలైవి' సినిమా..! తలైవి సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించింది. ట్రైలర్ ను చూసిన పలువురు ప్రముఖులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంగనా రనౌత్ నటనను పొగిడారు. ఇక కంగనా కూడా వర్మ ట్వీట్ పై స్పందించింది.

"హాయ్ కంగనా అండ్ టీమ్. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో, కొన్ని విషయాల్లో నిన్ను నేను వ్యతిరేకించవచ్చు. అయితే, ఇంత సూపర్ డూపర్ స్పెషల్ క్యారెక్టర్ ను చేసినందుకు నీకు సెల్యూట్ చేస్తున్నాను. తలైవి ట్రయిలర్ మైండ్ బ్లోయింగ్. స్వర్గంలో ఉన్న జయలలిత కూడా దీన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు" అని వర్మ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

ఇక ఈ ట్వీట్ ను చూసిన కంగనా "హాయ్ సార్. నేను మిమ్మల్ని ఏ విషయంలోనూ వ్యతిరేకించడం లేదు. గర్వం, ఈగో నిండిపోయిన ఈ ప్రపంచం ఎంతో సులువుగా మనసులను బాధిస్తుంది. ఈ సమయంలో మీరు చూపే దృక్పథాన్ని నేను అభినందిస్తాను. మీరు దేన్నీ సీరియస్ గా తీసుకోరు. మిమ్మల్ని మీరు కూడా. మీ పొగడ్తలకు కృతజ్ఞతలు" అని రిప్లై ఇచ్చింది. వీరిద్దరి మధ్య ఇంత కూల్ సంభాషణను నెటిజన్లు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.



Next Story