హేయ్‌ ప‌వ‌న్ సార్‌.. కాబోయే ప్ర‌ధాని చెప్పేది వినండి

Ram Gopal Varma counters with KA Paul video.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల కాలంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 9:28 AM GMT
హేయ్‌ ప‌వ‌న్ సార్‌.. కాబోయే ప్ర‌ధాని చెప్పేది వినండి

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న త‌న సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌తిరేకంగా ఆయ‌న ఎన్నో సార్లు కామెంట్లు చేయ‌గా.. కొన్ని వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. కాగా.. తాజాగా వ‌ర్మ కేఏ పాల్ మాట్లాడిన ఓ వీడియోను 'హేయ్ ప‌వ‌న్ సార్‌.. కాబోయే ప్ర‌ధాని చెప్పేది విను ' అని కామెంట్ చేస్తూ పోస్టు చేశాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ పోస్టు చేసిన వీడియో ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం కావాలంటే ఓ ప‌ని చేయాల‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ చెప్పాడు. 'ప‌వ‌న్ ఫ్యాన్స్ అంద‌రికి ఒక‌టే చెబుతున్నా.. ప‌వ‌న్ సీఎం కావాల‌న్నా.. మినిస్ట‌ర్ కావాల‌న్నా.. ఆయ‌న్ను ప్ర‌జాశాంతి పార్టీలో చేర‌మ‌ని చెప్పిండి. 42 మంది ఎంపీల‌ను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్ర‌ధానిగా ఉంటా. ప‌వ‌న్‌ను కావాలంటే ముఖ్య‌మంత్రిని చేద్దాం' అని కేఏ పాల్ అన్నారు.

అయితే.. కేఏపాల్ ఈ మాటల‌ను గ‌తంలో ఓ ఇంట‌ర్య్వూలో చెప్పాడు. కాగా.. ఇప్పుడు ఆ వీడియోను రామ్‌గోపాల్ వ‌ర్మ షేర్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it