మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో తెలుగు సినిమా తారల మైనపు విగ్రహాలను పెట్టడానికి ప్రముఖంగా దృష్టి సారించింది

By Medi Samrat  Published on  30 Sept 2024 7:17 PM IST
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో తెలుగు సినిమా తారల మైనపు విగ్రహాలను పెట్టడానికి ప్రముఖంగా దృష్టి సారించింది. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయడానికి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు ముందుకు వచ్చారు. "RRR" తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత రామ్ చరణ్ స్టార్ నటుడిలో ఒకరిగా మారారు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

రామ్ చరణ్, అతని పెంపుడు కుక్క రైమ్‌ కొలతలను తీసుకుంటున్న వీడియోను మేడమ్ టుస్సాడ్స్ టీమ్ విడుదల చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో భాగమైనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే తెలుగు స్టార్స్ ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు సంబంధించిన మైనపు విగ్రహాలు ఉన్నాయి.

Next Story