తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు

Ram Charan Upasana Expecting their first child. మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.

By Medi Samrat  Published on  12 Dec 2022 3:16 PM IST
తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారని.. త్వరలోనే వారికి బిడ్డ పుట్టబోతున్నాడని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రామ్ చరణ్ – ఉపాసన వివాహం 2012లో జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు, పలువురు ప్రముఖులు రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు.


Next Story