ఆర్‌సీ15 షూటింగ్‌ కోసం.. రాజమండ్రికి వెళ్లిన రామ్‌చరణ్‌.. భారీగా తరలివచ్చిన అభిమానులు

Ram Charan lands in Rajahmundry for RC15 shoot, gets mobbed by fans. రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ఆర్‌సీ 15 షూటింగ్‌లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వెళ్లాడు.

By అంజి  Published on  14 Feb 2022 8:30 AM GMT
ఆర్‌సీ15 షూటింగ్‌ కోసం.. రాజమండ్రికి వెళ్లిన రామ్‌చరణ్‌.. భారీగా తరలివచ్చిన అభిమానులు

రామ్ చరణ్ తన రాబోయే చిత్రం ఆర్‌సీ 15 షూటింగ్‌లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వెళ్లాడు. రాజమండ్రిలో దిగిన వెంటనే ఎయిర్‌పోర్టు బయట వందలాది మంది చరణ్‌ అభిమానులు గుమిగూడారు. తన హోటల్‌కు వెళ్లే మార్గంలో రామ్ చరణ్ అభిమానులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ఘన స్వాగతం పలికారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. రామ్ చరణ్ తన రాబోయే చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఫిబ్రవరి 13న, రామ్ చరణ్, అతని బృందం ఆర్‌సీ15 షూటింగ్ కోసం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. చరణ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు విమానాశ్రయం వెలుపల వేచి ఉన్నారు. అతని అభిమానులు భారీగా రావడంతో.. బౌన్సర్లు చరణ్ కోసం మార్గం క్లియర్ చేయవలసి వచ్చింది. ఆయన హోటల్‌కు వెళుతుండగా అభిమానులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి చరణ్‌కు ఘనస్వాగతం పలికారు.

ఆర్‌సీ 15 పొలిటికల్ డ్రామా, దీనికి దర్శకుడు శంకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆర్‌సి15 కథను తానే రాసుకున్నట్లు వెల్లడించారు. అతను సినిమా వికటన్‌తో మాట్లాడుతూ.. "చాలా సంవత్సరాల క్రితం నా దగ్గర ఈ రాజకీయ కథ ఉంది. చాలా కాలం క్రితం, శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చాలా కాలం క్రితం నేను భావించాను. కాబట్టి నేను అతనికి కథ చెప్పినప్పుడు, అతను దానిని ఇష్టపడి, ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాడు. అతనితో కలిసి పనిచేసినందుకు నేను చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాను." ఆర్‌సీ15లో రామ్ చరణ్‌తో పాటు కియారా అద్వానీ, అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్ మరియు నవీన్ చంద్ర నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ తిర్రు, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, కంపోజర్ ఎస్ తమన్ టెక్నికల్ టీమ్‌లో ఉన్నారు.

Next Story