హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా మూవీ ప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2024 8:00 PM IST
Ram Charan, Game Changer, Movie Update, Tollywood

హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది 

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా మూవీ ప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తయింది. చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హెలికాప్టర్‌ల వైపు నడుస్తున్న రెండు చిత్రాలను పంచుకున్నాడు. ఒకటి సినిమాలోని.. మరొకటి షూట్ పూర్తయిన తర్వాత తీసినదిగా చెబుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇక థియటర్లలో కలుద్దాం అంటూ గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు రామ్ చరణ్.

గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సముద్రఖని, SJ సూర్య నటిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ఓ వైపు భారతీయుడు-2 సినిమాతో బిజీగా ఉండడంతో గేమ్ ఛేంజర్ సినిమా పూర్తవ్వడం చాలా ఆలస్యమైంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.

Next Story