రామ్ చరణ్-శంకర్ సినిమా కథ నిజంగా అదేనా.?
Ram Charan And Shankar Movie. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 14 Feb 2021 6:35 PM ISTరామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక యాక్షన్ సినిమాగా ఉండబోతోందని చెప్తున్నారు. శంకర్ మార్క్ ఉంటూనే సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ సినిమాగా దీన్ని తెరకెక్కించబోతున్నారని టాక్. నిజానికి చాలామంది ఇది చారిత్రాత్మకమైన సినిమా అనే అనుకున్నారు.
మరోసారి కాళభైరవుడిగా మగధీరుడిగా రామ్ చరణ్ ని శంకర్ చూపించబోతున్నాడని కోలీవుడ్ లో వార్తలు వచ్చేస్తున్నాయి. కానీ, గతంలో దిల్ రాజు తన బ్యానర్ లో భారతీయుడు 2 సినిమా తీద్దామనుకుని ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ పై చారిత్రాత్మకమైన సినిమా చేయాలి అంటే ఖచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది.
కాబట్టి, మీడియం బడ్జెట్ లోనే ఈసినిమా ఉంటుందని టాక్. శంకర్ రెండు భాషల్లో ఈ సినిమాని ఒకేసారి తెరక్కిస్తున్నారట. తెలుగు, తమిళంలో ఒకేసారి తీసే ఆలోచనలో ఉన్నారు. అలాగే ట్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ప్యాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉంటుంది కాబట్టి మిగతా భాషల్లో కూడా దీన్ని రిలీజ్ చేస్తారట.
ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ , స్టార్ కాస్టింగ్ వివరాలు త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు. మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనేది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది.