అలసట వల్ల నీరసం అనుకున్నా కానీ..రకుల్!

Rakul Preet Singh Opens Up About Her COVID Journey. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ గత కొన్ని రోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే.అలసట వల్ల నీరసం అనుకున్నా రకుల్.

By Medi Samrat  Published on  1 Jan 2021 12:37 PM GMT
Rakul Preet Singh

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ గత కొన్ని రోజుల క్రితం కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులు స్వీయ నిర్బంధంలో ఉండి తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ నుంచి తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ముంబై వెళ్లారు. తాజాగా కరోనా సోకిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కరోనా నుంచి ఎలా కోలుకున్నారు?అనే విషయాలను గురించి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో తెలిపారు..

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవి తేజ్ కథానాయకుడిగాతెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో భాగంగా రకుల్ గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉంటూ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఒక రోజు షూటింగ్ సమయంలో ఎంతో నీరసంగా అనిపించింది. అయితే షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అలసట కారణంగా నీరసం వచ్చిందేమోనని అనుకున్నారు. షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ప్రతి మూడు రోజులకు ఒకసారి చిత్ర బృందం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకునేవారు. అందువల్ల కరోనా కాకపోవచ్చని రకుల్ భావించారు.

కాకపోతే ఎక్కువగా నీరసంగా ఉండటం వల్ల ఎందుకైనా మంచిదని ఒకరోజు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షలో పాజిటివ్ అని తెలియడంతో వెంటనే ఆ విషయాన్ని చిత్ర బృందానికి తెలిపి సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళారు."నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం కాదు, అంతా మంచే జరుగుతుందని"ఎల్లప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఉండేదానినని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే కరోనా బారిన పడినప్పుడు ఎక్కువ మందులను వాడకుండా, కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల, రోజువారి జీవిత అలవాట్ల కారణంగా తొందరగా ఈ వైరస్ నుంచి బయటపడ్డాడని ఆమె తెలిపారు.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ డీగ్లామర్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో "ఓబులమ్మ" అనే గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిగా మనకు కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.


Next Story