ఖరీదైన కారు కొన్న రకుల్..!

రకుల్ ప్రీత్ సింగ్ ఖరీదైన SUVని కొనుగోలు చేసింది. తాజాగా ముంబైలో ఆమె తన కొత్త కారుతో కనిపించింది.

By Medi Samrat  Published on  8 Sept 2023 7:19 PM IST
ఖరీదైన కారు కొన్న రకుల్..!

రకుల్ ప్రీత్ సింగ్ ఖరీదైన SUVని కొనుగోలు చేసింది. తాజాగా ముంబైలో ఆమె తన కొత్త కారుతో కనిపించింది. కారు ముందు పీచ్ కలర్ కుర్తీ, జీన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ సింపుల్ గా క్యూట్ గా కనిపించింది. రకుల్ కొత్త SUV Mercedes-Benz GLS మేబ్యాక్‌కి యజమాని అయ్యింది. అయితే ఈ SUV కోసం ర‌కుల్‌ భారీ మొత్తాన్నే ఖర్చు చేసింది. ఈ కారు మార్కెట్ ధర రూ. 2.92 కోట్లు.

‘గిల్లి’ అనే సినిమాతో రకుల్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2014లో 'యారియాన్' సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. రకుల్ బాలీవుడ్‌లో 'థ్యాంక్ గాడ్', 'రన్‌వే 34', 'ఎటాక్', 'కత్‌పుత్లీ', 'డాక్టర్ జీ' చిత్రాల్లో నటించింది. రకుల్ చివరిగా 'బూ'లో కనిపించింది. త్వరలో ఆమె 'అయలన్' అనే తమిళ చిత్రంలో నటించనుంది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఆర్. రవికుమార్. నవంబర్ 2023లో సినిమా విడుదల కానుంది.

Next Story