అతడినే పెళ్లి చేసుకున్న రకుల్
నటి రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
By Medi Samrat Published on 21 Feb 2024 6:15 PM ISTనటి రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట బుధవారం గోవాలో ఆనంద్ కరాజ్ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తర్వాత సింధీ వివాహ వేడుక జరగనుంది. ఐటిసి గ్రాండ్ సౌత్ గోవాలో ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్ తదితరులు హాజరయ్యారు.
రకుల్ ప్రీత్ సింగ్ 'చుద్దా' వేడుక బుధవారం ఉదయం షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత ఈ జంట ITC గ్రాండ్ సౌత్ గోవాలో మధ్యాహ్నం 3.30 తర్వాత ఏడడుగులు వేశారు. రకుల్-జాకీ పెళ్ళికి సంబంధించి రెండు వివాహ వేడుకలు ఉన్నాయి. ఆనంద్ కరాజ్, సింధీ తరహా వేడుకల్లో రెండు కుటుంబాల సంస్కృతులను ప్రతిబింబించేలా పెళ్లి జరిగింది.
రకుల్ ప్రీత్, జాకీ అక్టోబర్ 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమాల పరంగా రకుల్ ఇటీవలే అయలాన్ సినిమాలో కనిపించింది. రకుల్ కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2' లో కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.