బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని రోడ్డుపై ర‌చ్చ ర‌చ్చ చేసిన న‌టి

Rakhi Sawant was spotted outside the Bigg Boss OTT house. బిగ్‌బాస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టీవీ షో. భాష ఏదైనా సరే ఒకసారి

By Medi Samrat  Published on  18 Aug 2021 4:44 PM IST
బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని రోడ్డుపై ర‌చ్చ ర‌చ్చ చేసిన న‌టి

బిగ్‌బాస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టీవీ షో. భాష ఏదైనా సరే ఒకసారి బిగ్‌బాస్‌ షో ప్రారంభమైతే చాలు ఆ ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్‌ ఆకాశాన్ని అందుకుంటాయి.అలాంటి బిగ్‌బాస్‌ లో పాల్గొనటానికి నటీనటులు, యాంకర్స్ దాదపు అందరు సుముఖత వ్యక్తం చేస్తారు. అలాగే హిందీలో హిందీలో బిగ్‌బాస్‌-15 ఓటీటీ తనని ఎందుకు తీసుకోలేదని నటి రాఖీ సావంత్ రోడ్లపై హల్ చ‌ల్‌ చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్పెడర్‌ ఉమెన్‌ గెటప్‌ వేసి.. ముంబై వీధుల్లో అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ‌ చేసింది.

రాఖీ స్పీక‌ర్ పెట్టుకొని త‌ను డ్యాన్స్‌లు చేస్తుంటే రోడ్డుపై ఉన్న జ‌నం ఆశ్చ‌ర్య‌పోయారు. బిగ్ బాస్ షో అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. తాను రాఖీని కాదని.. స్పైడర్-ఉమెన్ అని స్పైడర్ వెబ్‌లతో తన ప్రత్యర్థులను నాశనం చేస్తానని బిగ్ బాస్‌కు చెప్పింది. తనకు బిగ్‌బాస్‌ షో అంటే చాలా ఇష్టమని చెబుతూ.. ఓటీటీ సీజన్‌లోకి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం రాఖీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట‌ తెగ హ‌ల్ చ‌ల్‌ చేస్తున్నాయి.


Next Story