రేపు ఉద‌యం ఢిల్లీలో రాజు శ్రీవాస్తవ అంత్యక్రియలు

Raju Srivastava to be cremated at 9.30 am tomorrow in Delhi. రాజు శ్రీవాస్తవ బుధ‌వారం ఉదయం (సెప్టెంబర్ 21) కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 21 Sept 2022 3:08 PM IST

రేపు ఉద‌యం ఢిల్లీలో రాజు శ్రీవాస్తవ అంత్యక్రియలు

రాజు శ్రీవాస్తవ బుధ‌వారం ఉదయం (సెప్టెంబర్ 21) కన్నుమూశారు. ఆయ‌న‌ వయసు 58 సంవ‌త్స‌రాలు. గుండెపోటుతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ అంత్యక్రియలు గురువారం ఉదయం 9.30 గంటలకు జరుగుతాయి. రాజు శ్రీవాస్తవ అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రేపు ఉద‌యం రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజును ముంబై లేదా కాన్పూర్‌కు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. రాజు శ్రీవాస్తవ భార్య శిఖా, కుమారుడు ఆయుష్మాన్, కుమార్తె అంతారా ప్రస్తుతం ఎయిమ్స్‌లో ఉన్నారు.

రాజు శ్రీవాస్తవ మ‌ర‌ణానంత‌రం ఎయిమ్స్ ఎలాంటి మెడికల్ బులెటిన్ విడుదల చేయలేదు. రాజు శ్రీవాస్తవ భౌతికకాయాన్ని నేడు ద్వారక సమీపంలోని దశరత్‌పురికి తీసుకెళ్లనున్నారు. రాజు తమ్ముడు దీపు శ్రీవాస్తవ్, అన్న సీపీ శ్రీవాస్తవ్ సాయంత్రానికి ఎయిమ్స్‌కు చేరుకుంటారు. రాజు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ఆయ‌న‌ బావమరిది ధృవీకరించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, "ఉదయం బీపీ పడిపోయిందని, ఆ తర్వాత సీపీఆర్‌ ఇచ్చామని.. తొలుత దానికి స్పందించి కుప్పకూలిపోయాడు. 2-3 రోజుల్లో వెంటిలేటర్‌ను తొలగించాలని భావించారని పేర్కొన్నారు.


Next Story