గుడ్‌న్యూస్ : హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడింది

Raju Srivastava not critical anymore, confirms comedian's younger brother. ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ పరిస్థితి విషమంగా ఉందని ఇన్ని రోజులూ

By Medi Samrat
Published on : 20 Aug 2022 3:22 PM IST

గుడ్‌న్యూస్ : హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడింది

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ పరిస్థితి విషమంగా ఉందని ఇన్ని రోజులూ ప్రచారం సాగింది. అయితే ఆయన కోలుకుంటున్నారని అతని తమ్ముడు దీపు శ్రీవాస్తవ ధృవీకరించారు. హాస్యనటుడు ఆగస్టు 10న గుండెపోటుకు గురయ్యాడు. అప్పటి నుండి ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉన్నాడు. రెండు రోజుల క్రితం రాజు శ్రీవాస్తవ పరిస్థితి క్షీణించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతూ.. అభిమానుల కోసం ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నాడు. రాజు శ్రీవాస్తవ ఆరోగ్యంపై ఎటువంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను, శ్రేయోభిలాషులను కోరాడు. రాజు శ్రీవాస్తవ ఇంకా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, తన సోదరుడికి అభిమానుల నుండి ఆశీర్వాదాలు ఉంటాయని తాను నమ్ముతున్నానని దీపు శ్రీవాస్తవ ఒక వీడియో సందేశంలో తెలిపాడు.

శేఖర్ సుమన్ కూడా రాజు శ్రీవాస్తవ ఆరోగ్యంపై అప్‌డేట్‌ను పంచుకున్నారు. "రాజు ఆరోగ్యం గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, క్రిటికల్ కండీషన్ నుండి బయటపడ్డాడు. అత్యుత్తమ వైద్యులు, న్యూరో సర్జన్లు చికిత్సను అందిస్తున్నారు. పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. రాజు బతకాలని పోరాడుతూ ఉన్నాడు. హర్ హర్ మహాదేవ్ (sic)." అని ట్వీట్ చేశారు.

రాజు శ్రీవాస్తవ ప్రముఖ హాస్యనటుడు, అనేక కామెడీ షోలలో భాగమయ్యాడు. శ్రీవాస్తవ ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్, కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షో, శక్తిమాన్, వంటి షోలలో భాగమయ్యాడు. మైనే ప్యార్ కియా, తేజాబ్, బాజీగర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు.


Next Story